శివాని డెబ్యూ మూవీ గ్రాండ్ లాంచ్
రాజశేఖర్ కుమార్తె శివానీ కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ మూవీ అన్నపూర్ణ స్డూడియోలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఇందులో యువ కథానాయకుడు అడివి శేష్‌కు జోడీగా కనిపించనున్నారు. ఈ సినిమాకు వెంకట్ కుంచం దర్శకత్వం వహిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కృష్ణం రాజు దంపతులు కూడా లాంచింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శివానీ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్యశ్రీ నటించనున్నారు.













