Adivi Sesh: హిట్3 మొదటి రివ్యూ వచ్చేసింది
నాని(nani) హీరోగా శైలేష్ కొలను(sailesh Kolanu) దర్శకత్వంల తెరకెక్కిన హిట్3(hit3) సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. హిట్వర్స్ లో భాగంగా వస్తోన్న మూడో భాగంపై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. నాని ఈ సినిమా ప్రమోషన్స్ ను కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ చేస్తున్నాడు.
మరో రెండ్రోజుల్లో రిలీజ్ కానున్న హిట్3 సినిమా గురించి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi Sesh) మొదటి రివ్యూ ఇచ్చాడు. హిట్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అడివి శేష్ తాను సినిమాలోని ఆఖరి 30 నిమిషాలు చూశానని, తాను చూసిన సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయని, సినిమాలో చాలా సర్ప్రైజులున్నాయని చెప్పాడు.
ఆ సర్ప్రైజులను స్క్రీన్ పై చూడ్డానికి ఆడియన్స్ తో పాటూ తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని, హిట్3 సూపర్బ్, క్రేజీ, మాటలు లేవని, మే 1న హిట్3 తో నాని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పాడు. హిట్3 గురించి అడివి శేష్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.






