Hit3: హిట్3లో అడివి శేష్
హిట్-3(Hit3) సినిమాకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ అనూహ్యంగా బయటపడింది. ఆదివారం జరిగిన హిట్-3 ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ సినిమా ఫైట్ మాస్టర్ సతీష్(sathish) పొరపాటున ఒక విషయాన్ని చెప్పి దొరికిపోయాడు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కెర్లు కొడుతున్న ఆ గుసగుసలకు సతీష్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. హిట్-3లో అడివి శేష్(adivi sesh) కీలకపాత్ర పోషిస్తున్నాడన్న గాసిప్స్‌ను సతీష్ మాటలు నిజం చేశాయి.
నేచరల్ స్టార్ నాని(nani) హీరోగా నటించిన హిట్-3 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్(viswaksen), అడివి శేష్ కూడా హాజరవ్వడం తెలిసిందే. అయితే, ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు తప్ప ఈ చిత్రంలో వారి పాత్రలు గురించి మాత్రం నోరు మెదపలేదు. అయితే స్టంట్ మాస్టర్ సతీష్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ నోరు జారాడు. దీంతో దర్శకుడు కొలను శైలేష్(sailesh Kolanu) సహా సినిమా యూనిట్ మొత్తం షాక్‌కు గురైంది.
హిట్-3 క్లైమాక్స్‌లోని ఫైట్ సీక్వెన్స్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి(sree nidhi Shetty) అదరగొట్టిందని, ఆమెతో పాటు హిట్-2 హీరో అడివి శేష్ కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా చేశాడని నోరు జారి తర్వాత నాలుక కర్చుకున్నాడు. అతడికి ముందు మాట్లాడిన అడివి శేష్ కూడా తన ప్రసంగంలో హిట్-3లో ఆఖరి 30 నిమిషాలు పలు ట్విస్టులతో చాలా బాగుందని గట్టిగా చెప్పడం అతడి పాత్రను తెలియజేస్తోందని సోషల్ మీడియా కొడై కూస్తోంది.






