కార్తిక్ రాజు నూతన చిత్రం ప్రారంభం
కార్తిక్ రాజు, వర్ష బొల్లమ్మ జంటగా నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్వరాజ్ నూనె దర్శకుడిగా పరిచయమవుతన్నారు. ఆదిత్య మూవీమేకర్స్ పతాకంపై గురవయ్య యాదవ్ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలను అనంతరం తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్‌కొట్టారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత గురవయ్య యాదవ్ మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. మే రెండో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. శ్రీచరణ్ పాకాల చక్కని బాణీలు అందిస్తున్నారు అని చెప్పారు. సంపత్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ ప్రవీణ్, మాటలు: సుధీర్‌వర్మ, పెరిచర్ల , కెమెరా: ఎన్.జయపాల్ రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.













