రవితేజకు జోడీగా అదితీరావు
ఆర్ఎక్స్ 100 తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ కథాయకుడిగా నటించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రానికి మహా సముద్రం అనే టైటిల్‌ని చిత్ర బృందం ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అదితీరావు హైదరీని ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. డిస్కోరాజా పూర్తి కాగానే రవితేజ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నారని తెలిసింది.













