అవకాశం వచ్చినప్పుడు…ఈ పని చేసి తీరుతా
నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పట్నుంచో ఏడెనిమిది మంది పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నా అని అంటోంది అదితి రావు హైదరీ. చెలియా, సమ్మోహనం, నవాబ్, అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించి నటిగా అదితి మంచి గుర్తింపు పొందింది. దక్షిణాదిలో పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌ల్లో భాగమవుతున్న అదితి చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవాలనుందని తన మనసులోని మాటని వెల్లడించింది. చిన్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఓ ఏడెనిమిది మంది పిల్లల్ని దత్తత తీసుకోవాలనే ఆలోచన గత కొన్ని రోజులుగా నా మదిలో మొదలుతోంది. అయితే ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. అవకాశం వచ్చినప్పుడు త్వరలో ఈ పని చేసి తీరుతా. దత్తత తీసుకున్న విషయం మీడియాకి వెల్లడించడం ఇష్టం లేదు. దాన్ని నా మైండ్‌లోనే ఉంచుకుంటా అని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో సైకో చిత్రలో నటిస్తోంది. అలాగే ధనుష్ దర్శకత్వం వహించబోయే చిత్రంలోనూ అదితి ఎంపికైందట.













