Adithi Rao Hydari: ఆ ప్రాజెక్టు తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు
తెలుగమ్మాయే అయినప్పటికీ తెలుగులో కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన అదితి రావు హైదరి(Aditi Rao Hydari) సమ్మోహనం(Sammohanam) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వి(V), మహా సముద్రం(Maha Samudram) సినిమాల్లో నటించింది. ఇటీవల అదితి సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) దర్శకత్వంలో వచ్చిన హీరామండి: ది డైమ్ండ్ బజార్(Heeramandi: The daimond bazaar) లో నటించి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.
రీసెంట్ గా అదితి హీరామండిలో అవకాశం రావడం, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేసే అవకాశం అనగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పానని చెప్పిన అదితి, ఈ సిరీస్ తర్వాత అవకాశాలు క్యూ కడతాయనుకున్నట్టు చెప్పింది.
ఈ సిరీస్ తో మంచి పేరు, క్రేజ్ వచ్చాయి కానీ తాను ఆశించిన ఆఫర్లు మాత్రం రాలేదని, హీరామండి తర్వాత తనకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని, ఆఫర్లు క్యూ కట్టకపోగా కరువైపోయాయని అదితి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఎలాగూ సినిమాల నుంచి బ్రేక్ దొరికింది కదా అని ఈ గ్యాప్ లో సిద్ధార్థ్(Siddharth) ను పెళ్లి చేసుకున్నానని, సిద్ధార్థ్ ఎంతో మంచి మనిషన అదితి వెల్లడించింది.













