ఆదిపురుష్ టీమ్ ప్లాన్ సూపర్..
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఇంకో 45 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు చాలానే ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ ఆ ఖర్చుకు తగ్గ బజ్ మాత్రం సినిమాపై ఏర్పడలేదు. బజ్ రాకపోగా, టీజర్ తో ఈ సినిమా అనవసరమైన నెగిటివిటీని మూటగట్టుకుంది.
దీంతో ఆ నెగిటివిటీని పోగొట్టుకునేందుకు ప్లాన్ చేసిన టీ సిరీస్. అందులో భాగంగానే ట్రైలర్ లాంఛ్ ను తెలుగు రాష్ట్రాల్లోనే ఏకండా 150-250 థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.ఇప్పటికే థియేటర్ల లిస్ట్ వచ్చేసింది. ఈ నెంబర్ ఇంకా పెరిగినా పెరగొచ్చంటున్నారు. మీడియాకు కూడా ఏఎంబీ మాల్ లో స్పెషల్ గా ట్రైలర్ ను స్క్రీనింగ్ చేయబోతున్నారట.
3 నిమిషాల వరకు ఉన్న ఆదిపురుష్ ట్రైలర్ ఎవరూ ఊహించని విధంగా వచ్చిందని టాక్. గతేడాది టీజర్ కు వచ్చిన కామెంట్లను దృష్టిలో ఉంచుకుని వాటిని రిపీట్ చేయకుండా, ఆ కామెంట్లకు సమాధానమిచ్చేలా ఇప్పుడు స్ట్రాంగ్ విజువల్స్ ని ట్రైలర్ లో పెట్టారట. వెయ్యు కోట్లకు పైగా గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుని నిర్మాతలు బిజినెస్ చేస్తున్నారు. ఆ రేట్లకు ఆదిపురుష్ ను నమ్మి సినిమాను కొంటారా అని కొంతమంది అంటుంటే, టాక్ చూసి ప్రేక్షకులే ఈ సినిమాకు బ్రహ్మరథం పడతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లు వచ్చేలా నిర్మాతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు ఈసారి ప్రమోషన్లలో ప్రభాస్ కూడా పాల్గొననున్నాడు.
సినిమా చాలా బాగా వచ్చిందని, ఇక ముందు శ్రీ రాముడు గురించి తలచుకుంటే ఆది పురుష్ గుర్తొచ్చే రేంజ్లో సినిమా అవుట్ పుట్ ఉందని చిత్ర యూనిట్ చెప్తోంది. అయితే రిలీజ్ కు ముందు అందరూ ఇలానే చెప్తారు కాబట్టి ఆ మాటల్ని నమ్మలేం. ఏదైనా సరే ఆదిపురుష్ సక్సెస్ అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్లతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఈ సక్సెస్ మంచి బూస్ట్ ఇవనుంది.













