ప్రభాస్ బర్త్ డే కి ఆది పురుష్ నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ అయిపోయి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఖచ్చితంగా సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గత రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు చాలా టైమ్ ఉందంటూ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్‌లను వాయిదా వేస్తూ వస్తున్నారు దర్శకనిర్మాతలు. వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది. కనీసం ఆ బర్త్ డే కి అయినా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయమని డైరెక్టర్‌కు ఫ్యాన్స్ నుంచి ఎన్నో విజ్ఞప్తులు వెళ్లగా, రీసెంట్గా దర్శకుడు ఓమ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ లుక్ మాత్రమే కాదని, అందరూ సర్ప్రైజ్ అయ్యే అప్డేట్ కూడా ఇవ్వనున్నామని, ఆ అప్డేట్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలను పెంచబోతుందని కూడా ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు.













