రిస్క్ ఎందుకులే అనుకుంటున్న ఆదిపురుష్ టీమ్
ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమాను మూడు రోజులు ముందుగానే ప్రీమియర్లు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించబోయే అన్ని సినిమాల కంటే ముందుగానే ఈ సినిమాకే టికెట్లు భారీగా అమ్ముడు పోవడం సంచలనం సృష్టించింది. కానీ వీటిని క్యాన్సిల్ చేసినట్లుగా వస్తున్న వార్త ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది.
అంతేకాదు, సాధారణంగా ఇండియా టైమ్ ప్రకారం చాలా ముందుగానే వేసే యూఎస్ షో లను కూడా క్యాన్సిల్ చేసే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచిదనే అనుకోవాలి. ఈ ఎర్లీ షో ల వల్ల డివైడ్ టాక్ రావడం, ఆ రివ్యూలు ఇక్కడ సినిమాను చంపేయడం చాలా క్యాజువల్ అయిపోయింది.
ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో సినిమా చూశాక ఏదైనా తేడా కొడితే ఆ ఎఫెక్ట్ ఇక్కడ బాక్సాఫీస్ మీద పడటం ఖాయం. వాస్తవానికి ఆదిపురుష్ విషయంలో ఇంతకుముందున్న నెగిటివిటీ ట్రైలర్ చూశాక లేదు. ఆడియన్స్ లో ట్రైలర్ పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చింది. నెగిటివిటీ తగ్గిన మాట వాస్తవమే అయినా కూడా ఈ నిర్ణయం తీసుకుంటే సాహసం చేసినట్లే అవుతుంది.
జూన్ 15న మెయిన్ సిటీల్లో స్పెషల్ షో లు వేసే ఆలోచనను కూడా నిర్మాణ సంస్థ ఇంకా పరిశీలనలోనే ఉంచింది. ఏదైనా సరే ఆదిపురుష్ మూవీకి సంబంధించి పోస్ట్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అందరికీ ఒకేసారి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ నటిస్తోంది.













