రెబల్ స్టార్ ఫాన్స్ కి శుభవార్త : శ్రీరామ నవమి కి ‘ఆదిపురుష్’ అవతార తొలి వీక్షణం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ మహాకావ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే రేపు బుధవారం (ఏప్రిల్ 21న) శ్రీరామ నవమి సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ‘బాహుబలి’ చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అంతర్జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత అతను బాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’ ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా జరుగుతుండగా.. ప్రభాస్ మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా. రామాయణ మహాకావ్యం ఆధారంగా పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. 30వేల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయిందని చిత్రబృందం ప్రకటించింది. గత సంవత్సరమే సినిమా ప్రధాన పాత్రధారుల ప్రిన్సిపల్ ఫోటోగ్రాఫి పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్లు బాడీ ట్రాన్స్‌ఫార్మ్ కోసం ఎంతో శ్రమిస్తున్నారని, కృతి సనన్‌తో కలిసి పని చేయడం ఎంతో మంచి అనుభూతి అని తెలిపారు. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. మొత్తానికి మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.













