కష్టాలలో “ఆదిపురుష్” డైరెక్టర్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ కి కష్టాలు తప్పడం లేదా? అంటే అవుననే చెప్పాలి. ఇక వివరాలలోకి వెళితే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో, దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో టి. సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ కి ముందే ప్రేక్షకులలో ఎంతో హైప్ ని క్రియేట్ చేసింది.
టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ సినిమా టీజర్ కోసం యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే టీజర్ లో గ్రాఫిక్స్, ప్రభాస్ ని రాముడిగా చూపించిన తీరు, హనుమంతుడి వేషధారణ మరియు ఇతర పాత్రల మేకోవర్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరుని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ప్రభాస్ లాంటి హీరో ని పెట్టుకొని ఆదిపురుష్ కి ఇలాంటి గ్రాఫిక్సా? అని అవాక్కయ్యారు.
ఈ సినిమా టీజర్ ఏ విధంగానూ ఇంప్రెస్సివ్ గా లేదని చిత్ర బృందం పై ప్రేక్షకులు దాడికి దిగారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ పై నెటిజన్స్ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. జపనీస్ యానిమేటెడ్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు ఓం రౌత్ ఎంత పెద్ద తప్పు చేశాడో నెటిజన్లు ఆయనకు బాగానే గుర్తు చేసారు. దర్శకుడు చాలా లైట్ తీస్కొని ఈ చిత్రాన్ని చేసినట్టుగా ఉందని, అందుకే ఇండియన్ వెర్షన్ రామాయణం లా ఆదిపురుష్ టీజర్ లేదని మండిపడ్డారు.
మన పురాణాలపై పట్టు లేని వాళ్ళు ఎవరో తీసినట్టుగా ఉందని దర్శకుడు ఓం రౌత్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఈ విమర్శలతో మళ్ళీ రీ వర్క్ చేయడం మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. దక్షిణాదిలో ప్రేక్షకులు ఈ చిత్ర టీజర్ పై విమర్శలు కురిపించడంతో , ఉత్తరాది ప్రేక్షకులు కూడా మెల్లమెల్లగా ఆదిపురుష్ టీం పై విరుచుకుపడడం స్టార్ట్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం మరింత ఒత్తిడికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది.
ఈ తరుణంలోనే దర్శకుడు ఓం రౌత్ కి కొత్త కష్టాలు మొదలైనట్టు తెలుస్తుంది. తాజా గా రిలీజ్ అయిన “హనుమాన్ ” టీజర్ ఒక రేంజ్ లో ఉండడం, ఈ చిత్రానికి అసలు గ్రాఫిక్స్ వర్క్ చేసినట్టుగా కూడా కనిపించకపోవడం, కంటికి ఇంపుగా ఉండడంతో.. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ ఆదిపురుష్ టీం పై మరింత విమర్శల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ మూవీ టీం ఇంకా ఒత్తిడికి గురవుతున్నట్లు కన్పిస్తుంది. మరి ఇన్ని విమర్శల మధ్యలో ఆదిపురుష్ టీం ఈ సారైనా ప్రేక్షకులని మెప్పిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే…













