ఆదికేశవతో ఆచార్యకు పోలిక.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిన ఆచార్య సినిమా చిరూ కెరీర్ మొత్తంలో అత్యంత చేదు అనుభవం మిగిల్చిన చిత్రంగా నిలిచింది. ఆచార్య అనే పేరు వస్తేనే మెగా ఫ్యాన్స్ భయపడే రేంజ్ లో ఆ సినిమా రిజల్ట్ ఉంది. అలాంటి సినిమాతో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఆదికేశవను పోల్చారు.
ఆదికేశవ టీజర్ రిలీజైనప్పుడు దానికి ఆచార్యతో పోలికలు కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. టీజర్లో హీరో గుడిని కాపాడే రక్షకుడి తరహా పాత్రలో కనిపించడంతో ఫ్యాన్స్ లో ఓ అలజడి మొదలైంది. దీంతో నెట్టింట ఈ సినిమాపై ఓ రకమైన నెగిటివిటీ వచ్చింది. తాజాగా ఈ విషయమై డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు.
ఆదికేశవ గుడిని కాపాడే హీరో స్టోరీ కాదని, ఈ సినిమాలో అంతర్లీనంగా శివుడి గురించి ప్రస్తావించాలని అనుకున్నామని, సినిమాలో గుడికి సంబంధించిన సీన్స్ ఓ పది నిమిషాల పాటూ మాత్రమే ఉంటాయని ఆ సీన్స్ తో కూడిన గ్లింప్స్ తో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అలా స్టార్ట్ చేశామని, కానీ దాన్ని చూసి కొందరు ఆచార్య సినిమాతో పోలిక పెట్టినట్లు, ఈ సినిమా కథ వేరే అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఆదికేశవ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.













