Adah Sharma: వాటిని అసలు పట్టించుకోనంటున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ
హార్ట్ ఎటాక్(Heart Attack) మూవీతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన అదా శర్మ(Adah Sharma) తర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అవకాశాల కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది. ది కేరళ స్టోరీ(The Kerala Story) మూవీతో బాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న అదా గతేడాది ది కేరళ స్టోరీ డైరెక్టర్ తోనే కలిసి బస్తర్: ది నక్సల్ స్టోరీ(Bastar: The Naxal Story) చేసింది.
కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. రీసెంట్ గా ఆ మూవీ ఫ్లాప్ పై అదా మాట్లాడింది. ఏ మూవీకి అయినా ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ దక్కలేదంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయని ఆమె చెప్పింది. తాను ఒక మంచి సినిమా చేస్తున్నానా లేదా అనేది మాత్రమే చూస్తానని, తన దగ్గరకు వచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి చూస్తానని అదా శర్మ చెప్పింది.
ఇకపోతే తానెప్పుడూ బాక్సాఫీస్ నెంబర్లపై ఫోకస్ చేయలేదని, అలా దానిపై ఫోకస్ చేస్తే సినిమాలో సరిగా చేయలేనని, ది కేరళ స్టోరీ చేస్తున్నప్పుడు అది అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకోలేదని, లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ అది భారీ కలెక్షన్లు రాబట్టిందని అదా చెప్పింది. బస్తర్ మూవీ కూడా తాను బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని చేయలేదని అదా శర్మ తెలిపింది.













