అలా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు
ఆమధ్య కాస్టింగ్ కౌచ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తప్పు చేసిన వారందర్నీ బయటికి లాగింది కాస్టింగ్ కౌచ్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్…ఇలా ప్రాంతం ఏదైనా తప్పు చేసిన వారిని వదిలి పెట్టలేదు. కాస్టింగ్ కౌచ్ అనేది దుర్మార్గం, నీచం అని వాదించే వారు ఉన్నట్టే… అదేమంత పెద్ద తప్పు కాదే అంటూ లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈమధ్య ఈ విషయం గురించి హీరోయిన్ అదా శర్మ చేసిన వ్యాఖ్యలే దానికి ఉదాహరణ. కాస్టింగ్ కౌచ్ అనేది అసలు సమస్య కానే కాదని, ఈ విషయంలో ఎవరూ బవంతం చేయరని, తప్పు చెయ్యాలా? వద్దా? అనే ఆప్షన్ మనకు ఉంటుందని అంటోంది అదా. అవకాశం ఇస్తున్నారు కదా అని కమిట్మెంట్కు ఎందుకు ఎస్ చెప్పాలి? అప్పుడు అవకాశాల కోసం వారికి లొంగిపోయి.. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందంటూ రచ్చకెక్కడం ఎంతవరకు కరెక్ట్? తప్పు చెయ్యకూడదు అన్న విచక్షణ మనలో వుంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు అంటూ చెప్పుకొచ్చింది అదా శర్మ.













