ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు
నానీ హీరోగా తెరకెక్కుతోన్న జెర్సీ చిత్రంలో తాను ప్రత్యేక పాటకోసం కాలు కదపడం లేదని అన్నారు ఆదా శర్మ. ప్రస్తుతం డా.రాజశేఖర్ సరసన కల్కి లో నటిస్తున్నారామె. ఆదా శర్మ మాట్లాడుతూ నేను ప్రత్యేక గీతంలో నటిస్తున్నాననే విషయం అబద్ధం. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. మామూలుగా ఇలాంటి పుకార్లను నేను పట్టించుకోను. కానీ చాలా మంది ఈ విషయాన్ని నాతో పదే పదే ప్రస్తావిస్తుండటంతో ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి అంగీకరిస్తే తప్పుకుండా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటాను అని అన్నారు. నాని క్రికెటర్గా నటిస్తోన్న జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రద్దా శ్రీనాథ్ నాయిక. వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.













