అక్కడే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా!
సాధారణంగా అందరికీ కలలు ఉంటాయి. ఆ కలల గురించి ఓ లిస్ట్ రాసి పెట్టుకుంటారు. చిట్టీ మీద కాక పోయినా మనసులో అయినా రాసుకుంటారు. హీరోయిన్ త్రిషకి కూడా పెళ్లి విషయంలో ఓ డ్రీమ్ ఉందట. ఈ మధ్య త్రిష తన అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా కాసేపు చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీ డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న ఓ క్రేజీ డ్రీమ్ ఏంటి? అని ఓ అభిమాని అడగ్గా.. వేగాస్‌లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పారు త్రిష. అయితే వివాహ వ్యవస్థను నమ్ముతారా? అంటే లేదనుకుంటున్నాను అన్నారు.













