త్రిష రేంజే వేరుగా..
ఒకప్పుడు సౌత్ హీరోయిన్లకు చాలా తక్కువలో మాత్రమే రెమ్యూనరేషన్ అందేది. కానీ ఇప్పుడు హీరోల లాగే వారి రేంజ్ కూడా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్ల మాదిరిగా సౌత్ హీరోయిన్లు కూడా భారీ రెమ్యనరేషన్లు తీసుకుంటున్నారు. విషయానికొస్తే, ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ త్రిష రెమ్యనరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన త్రిషకు దేశమంతటా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమా కారణంగా త్రిష మళ్లీ మునుపటిలా బిజీ కాబోతుంది. పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష కమిట్ అవబోతున్న సినిమాలకు ఏకంగా రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట అమ్మడు.
సౌత్ లో ఈ రేంజ్ లో పారితోషకం అందుకుంటున్న అతి తక్కువ హీరోయిన్లలో త్రిష కూడా ఒకటి. సిటాడెల్ సిరీస్ కోసం సమంత కూడా రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడమంటే మాటలు కాదు. త్వరలోనే త్రిష చిరంజీవితో జత కట్టబోతుందని వార్తలొస్తుండగా, మరి ఆ సినిమాకు అమ్మడు ఏ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చూడాలి.













