అలా అనుకొన్నా.. అది నెరవేరేది కాదు
ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్నే నమ్ముకోవాలి తప్ప వేరొకరిలా కావాలని మనల్ని మనం పక్కన పెట్టకూడదు అంటోంది తమన్నా. పరిశ్రమలోకి వచ్చాక నేను నాలాగే ఉన్నాను తప్ప, వేరొకరిని అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని చెబుతోంది. తమన్నా త్వరలోనే నెక్ట్స్ ఏంటి?, దట్ ఈజ్ మహాలక్మి చిత్రాలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం ఎఫ్ 2, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటిస్తోంది. తమన్నాలా పేరు తెచ్చుకోవాలంటుంటారు చాలామంది కథానాయికలు. మరి తొలినాళ్లలో మీరలా ఎవరి గురించి అనుకొనేవారని అడిగితే నాకు స్ఫూర్తినిచ్ని కథానాయికలు చాలా మందే. అయితే వాళ్లలాగే నేను నటించాలని, అలాంటి గుర్తింపే నాకు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకొన్నా అది నెరవేరేది కాదు. నా బలాలేంటో తెలుసుకొని అందుకు తగ్గట్టుగా కెరీర్ని మలచుకొన్నా. సినిమాపై నాకున్న తపనని నా పనిలో చూపించానంతే. ఇక పేరు ప్రఖ్యాతులు, విజయాలనేవి వాటంతట అవే నన్ను అనుసరించాయని చెప్పింది తమన్నా.













