నా దృష్టిలో దాని గురించి చర్చే అవసరం లేదు
పాత్రల్లో నాణ్యతని చూసుకొని నిర్ణయం తీసుకోవడం తప్ప, సినిమా చేయడంలో ఇతరత్రా వ్యూహాలేమీ ఉండవని చెబుతోంది తమన్నా. ప్రస్తుతం జోరుమీదున్న దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఆమె ఒకరు. త్వరలోనే నెక్ట్స్ ఏంటి?, దటీజ్ మహాలక్ష్మి, చిత్రాలతో సందడి చేయబోతోంది. వెంకటేష్‌తో ఎఫ్2, చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటిస్తోంది. సినిమాల్లో కథానాయకుల పాత్రలతో పోలిస్తే మీ పాత్రల పరిధి తక్కువే కదా, ఆ విషయం గురించి మీ అభిప్రాయమేంటి? అని అడిగితే నా దృష్టిలో దాని గురించి చర్చే అవసరం లేదని బదులిస్తోంది తమన్నా. సినిమాలో కథానాయకుడు చేయాల్సింది మేం చేయలేం, మేం చేయాల్సింది వాళ్లు చేయలేరు. ఎవరి పాత్రలు వాళ్లవి. ఇందులో తక్కువ ఎక్కువ అనే ప్రస్తావన ఎందుకు? అదే ఒక కథ మహిళ చుట్టూ తిరుగుతుందన్నప్పుడు ఎవరెన్ని చెప్పినా, అందులో తప్పకుండా కథానాయికకి ప్రాధాన్యం ఉంటుంది. అరతే తప్ప వాళ్లు ఇన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు కాబట్టి, నాకు అంత పరిధి కావాలని చెప్పలేను. సన్నివేశాల సంఖ్యని బట్టి ఎప్పుడూ సినిమాని ఎంపిక చేసుకోలేదని చెప్పింది తమన్నా.













