మీరు స్పందించకపోతే… పబ్లిక్ లో నగ్నంగా నిలబడతా
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులు, మోసాలపై హీరోయిన్ శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీరంగంలోని పలువురి పేర్లను ఆమె పరోక్షంగా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కల్పించుకుని, సినీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆమె విన్నవించింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే, పబ్లిక్‌లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు అని ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.













