శ్రీలీల… వామ్మో ఇంత టాలెంటెడా?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల మహిమే. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీలకు ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే యూత్ కు పిచ్చెక్కించే డ్యాన్స్ లు వేసి అందరి మతులు పోగొట్టేసింది శ్రీలీల. ఇక రెండో సినిమా ధమాకా సక్సెస్ విషయంలో కూడా శ్రీలీల పాత్ర చాలానే ఉంది. చేసిన మొదటి రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడంతో శ్రీలీలకు ఆఫర్లు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ప్రతి హీరో, దర్శకుడు, నిర్మాత తమ సినిమాలో శ్రీలీలను కావాలని కోరుకుంటున్నారంటే అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
రానున్న 5 నెలల్లో శ్రీలీల నుంచి 5 సినిమాలు రాబోతున్నాయి. అవి కూడా పండగ సీజన్స్ లో. వినాయక చవితికి స్కంద, దసరాకు భగవంత్ కేసరి, దీపావళికి ఆదికేశవ, క్రిస్మస్ కు ఎక్స్ట్రా, సంక్రాంతికి గుంటూరు కారం ఇలా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేయనుంది శ్రీలీల. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ శ్రీలీలకు కొంచెం కూడా అహం పెరగలేదు. రీసెంట్గా స్కంద ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడిన మాటలు చాలా హుందాగా ఉన్నాయి.
అంతేకాదు, ఏ ఈవెంట్ లో అయినా, ఇంటర్వ్యూలో అయినా తెలుగులోనే చక్కగా మాట్లాడి ఆడియన్స్ లో బుట్టలో వేసుకుంటుంది శ్రీలీల. స్కంద ఈవెంట్ లో పాట పాడి, స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇన్ని టాలెంట్స్ ఉన్న శ్రీలీల కెరీర్ కు మరి కొన్నేళ్ల పాటూ ఢోకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.













