శ్రీలీల భారీ స్కెచ్!
పెళ్లి సందడి2 సినిమాతో టాలీవుడ్లోకి ఎంటరైన కన్నడ భామ శ్రీ లీల, మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో మంచి డెబ్యూ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కేవలం పేరు మాత్రమే కాదు, రెండో సినిమాకే మాస్ మహారాజా రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ధమాకా సినిమా రిలీజ్ అయ్యాక ఇక ఎక్కడ విన్నా శ్రీ లీల పేరే వినిపిస్తోంది.
ఆమె ఎనర్జీ, డ్యాన్స్ లకు ఆడియన్స్ పిచ్చోళ్లయిపోయారు. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం ఈ టాలెంటెడ్ బ్యూటీ కోసం ఎదురు చూస్తుండటంతో శ్రీలీల క్రేజ్ టాలీవుడ్లో టాప్ రేంజ్‌కి చేరింది. దీంతో టాప్ డైరెక్టర్లంతా తన డేట్స్ కోసం ఆమె వెంట పడుతున్నారు. టాప్ స్టార్లకు ఫేవరెట్ గా మారిన శ్రీలీల ఎవరితో పడితే వారితో సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.
బాగా ఆలోచించి సీనియర్ హీరోలతోనే సినిమాలు ఒప్పుకుంటుంది శ్రీలీల. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. అది కాకుండా సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.
వీటితో పాటు రామ్ బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీకి శ్రీలీల సైన్ చేసింది. పంజా వైష్ణవ్ తేజ నటిస్తున్న 4వ సినిమా, నితిన్ – వక్కంతం వంశీల ప్రాజెక్ట్ ఇలా నాలుగైదు భారీ సినిమాలను లైన్లో పెట్టింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు కూడా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ను కూడా శ్రీలీల రీసెంట్ గా కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే శ్రీలీల రేంజ్ టాలీవుడ్లో టాప్ రేంజ్‌కు వెళ్లడం ఖాయం.













