అంధురాలిగా సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ తాజాగా నటించిన ది జోయ్ ఫ్యాక్టర్ కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ చిత్రం తర్వాత తాజాగా అంధురాలిగా కనిపించనున్న సినిమాలో ఈమె నటించబోతుంది. బ్లయిండ్ అనే సౌత్ కొరియన్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. అక్కడ 2011 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందించేందుకు కోసం ఈ చిత్రం రీమేక్ హక్కులను సుజోయ్ ఘోష్ దక్కించుకున్నారు. సోనమ్ కపూరే ఈ పాత్రకు న్యాయం చేయగలదని ఆయన భావించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోనమ్ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు యాక్షన్ గానీ, హారర్ నేపథ్య చిత్రాల్లో గానీ నటించలేదు. అందువల్ల ఈ రెండు జోనర్లలో నేను నటించాల్సి ఉంది. ఇవి చాలా విభిన్నమైనవి. అందులో చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ చిత్రాల్లోనూ చేయలేదు కదా. అందువల్ల ఆ రెండు జోనర్లలో ఒకటి ఈ చిత్రంతో తీరనుంది. ఇది ఆసక్తిగా చేయడానికి ప్రయత్నిస్తాం అని పేర్కొంది.













