బంపరాఫర్లు కొట్టేసిన శ్రియా రెడ్డి
చాలామందికి టాలెంట్ ఉన్నా సరే అదృష్టం కలిసిరానప్పుడు ఏం చేయలేరు. అలా టాలెంట్ ఉండి మంచి సినిమాలు చేయలేని వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో శ్రియా రెడ్డి ఒకరు. 2003లో అప్పుడప్పుడు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియాకు తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. శర్వానంద్‌తో అమ్మ చెప్పింది సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేసింది. అయినా పెద్దగా లాభం లేదు.
ఎప్పుడైతే శ్రియా, విశాల్ సినిమా పొగరులో విలన్ గా నటించిందో ఆమె యాక్టింగ్ సత్తా ఏంటో అందరికీ తెలిసిపోయింది. తర్వాత విశాల్ అన్న విక్రమ్ కృష్ణ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అప్పుడప్పుడు స్క్రీన్ పై మెరిసినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. మొన్నీ మధ్య సుజల్ అనే వెబ్ సిరీస్‌తో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రియా రెడ్డికి ఇప్పుడు బంపరాఫర్లు వచ్చాయి.
ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్న శ్రియాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అమ్మడుకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ లోనూ ఓ మంచి క్యారెక్టర్ దక్కినట్లు టాక్. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రియాను ఓ షాకింగ్ రోల్ లో చూపించబోతున్నాడట సుజిత్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడితే అమ్మడుకు మళ్లీ ఛాన్సులు పెరగడం ఖాయమే అనిపిస్తుంది.













