హ్యాట్రిక్ కి రెడీ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మ..!
టాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అప్ కమింగ్ హీరోయిన్ సంయుక్త మీనన్. మలయాళం లో ఈ అమ్మడు దాదాపు పది సినిమాలకి పైగా నటించి అక్కడి ప్రేక్షకులని ఆకట్టుకుంది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. భీమ్లా నాయక్ సినిమాలో రానా కి జోడిగా నటించి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి చేరువైంది.
ఇక ఈ హీరోయిన్ తదుపరి సినిమా ఏకంగా నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రంలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటించింది. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో సంయుక్త మీనన్ ని లక్కీ గర్ల్ గా టాలీవుడ్ లో పిలుస్తున్నారు. కళ్యాణ్ రామ్ కి జోడిగా నటించి ఈ ముద్దుగుమ్మ మంచి మార్కులే కొట్టేసింది. భీమ్లా నాయక్, బింబిసార రెండు సినిమాలు టాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం సంయుక్త మీనన్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో ఈ అమ్మడు నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, రీసెంట్ గానే సార్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సార్ సినిమా కనుక హిట్ అయితే ఈ మలయాళ ముద్దుగుమ్మ హ్యాట్రిక్ కొట్టినట్టే. ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో సంయుక్త హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఫ్యూచర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అవుతుంది సంయుక్త మీనన్.













