సాయి పల్లవి గ్యాప్ కు రీజన్ అదేనా?
సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సాయి పల్లవి సినిమాలు చేయాలంటే ముందుగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆమె క్యారెక్టర్ కు స్పెషల్ ఐడెంటిటీ ఉంటేనే ఆ సినిమా పల్లవి చేస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే కాదు, రిలీజ్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్ గురించి జనాలు మాట్లాడుకునేలా ఉండాలి.
అలా అయితేనే ఆమె సినిమాలు చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నిర్మొహమాటంగా సినిమాలకు నో చెప్పేస్తుంది. ఇక గ్లామర్ క్యారెక్టర్స్ అయితే ఆమె దగ్గర్లోకి కూడా రానీయదు. అందుకే అమ్మడికి అందరితో పోలిస్తే ఛాన్స్ లు తక్కువగా వస్తుంటాయి. సాయి పల్లవిలోని ఈ క్వాలిటీనే ఆమెకు స్పెషల్ ఐడెంటిటీని తెచ్చి పెట్టింది.
సాయి పల్లవి నుంచి వచ్చిన చివరి సినిమా విరాట పర్వం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆమె నుంచి మరో సినిమా అనౌన్స్ అయింది కూడా లేదు. సాయి పల్లవి కావాలనే ఇలా గ్యాప్ తీసుకుంటుందా లేక తనకు నచ్చిన క్యారెక్టర్లు రాక సినిమాలు చేయట్లేదా అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
నిజానికి సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఫెయిలయినా తన యాక్టింగ్ పరంగా ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. అలాంటి ఆమెను మెప్పించాలంటే అంత ఈజీ కాదు. మేకర్స్ అందరూ హీరో ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని స్టోరీలు రాసుకుంటారు కాబట్టి సాయి పల్లవికి ఛాన్స్ లు తగ్గుతున్నాయని చెప్పొచ్చు.













