ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న రేణు
పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని రేణు దేశాయ్ పిల్లలతో ఒంటరిగా ఉంటున్న విజయం తెలిసిందే. కొన్నేళ్ల కిందట రేణు ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుని, ఆ వ్యక్తి ఫోటోను సీక్రెట్‌గా ఉంచి, ఎంగేజ్మెంట్ విషయాన్ని మాత్రమే అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఎంగేజ్మెంట్ తర్వాత రేణు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా లేక ఆ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుందా అనేది క్లారిటీ లేదు. ఈ విషయంలో రేణు దేశాయ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. గతంలో తను ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తితో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు రేణు వెల్లడించింది.
రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకెప్పటి నుంచో ఉందని, అందులో భాగంగానే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనిపించి, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఆమె తెలిపింది. కానీ ఆ టైమ్ కు ఆద్యకు వయసు ఏడేళ్ల కావడంతో, పెళ్లి చేసుకుంటే తనకు టైమ్ ఇవ్వలేననిపించి రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు రేణూ చెప్పుకొచ్చింది. మరో రెండేళ్ల తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని రేణు తెలిపిన రేణు పవన్ తో విడాకులు ఎందుకు తీసుకుందో అనే విషయం గురించి మాట్లాడటానికి మాత్రం ఇష్టపడలేదు.













