హీరోయిన్ కాకపోయుంటే మీలా ప్రశ్నలు వేసేదాన్ని – రష్మిక మందన్న
ముంబై ఫాషన్ ఫీల్డ్ లో అతి చిన్న వయసులోనే మోడల్ గా మారి, ఆ తర్వాత సినీ హీరోయిన్ గా ప్రమోషన్ వచ్చిన తరువాత ఎవరైనా మీడియా ప్రతినిధి, నటి కాకుంటే మీరేం కావాలని అనుకున్నారు అనే రొటీన్ ప్రశ్నవేయగానే…. అంతకంటే రొటీన్‌గా తాము డాక్టర్ అవుదామని అనుకున్నా కానీ…. అనుకోకుండాయాక్టర్ ని అయ్యామని చెబుతుంటారు. కానీ ఈ ప్రశ్నకు ఊహించని సమాధానం చెప్పింది రష్మిక మందన్న. వివరాల్లోకి వెళితే…. ఏ హీరోయిన్ అయినా మోడల్ గా మారేది ఏ టెన్త్ క్లాసులోనో అనుకోండి. అదివేరే విషయం ముంబై లో క్యాస్టింగ్ కి సంభందించిన ఆఫీస్‌లు కోకొల్లలు సౌత్ నుండి కొత్త హీరోయిన్ కావాలంటే వెంటనే డైరెక్టర్లు నిర్మాతలు ముంబై హోటల్ బుక్ చేసుకోవలసిందే. అక్కడి కోఆర్డినేటర్స్ సహాయంతో హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడి వుండే మోడల్స్ ఇండియా నాలు మూలాలనుండి ముంబై లో మకాం పెడతారు.
ఈ విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కన్నడ భామ రష్మికా మందన్న ఒకానొక ఇంటర్వ్యూ లో తానూ మాత్రం జర్నలిస్ట్ ని కాబోయి హీరోయిన్ గా మారానని ఆధారాలతో సహా చూపించింది. అందులో భాగంగా జర్నలిస్ట్ కావడానికి అవసరమైన చదువు కూడా చదివిన ఈమె ప్రస్తుతం దక్షిణాదిలోటాప్ హీరోయిన్గా మారింది. అది కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే. ఈ విషయంలో ఈమె ఎందరికో స్ఫూర్తి అని మాత్రం చెప్పవచ్చు. సినీ రంగంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం, అవకాశాలు దక్కించుకోవడం, వరుస విజయాలను సాధించడం అంత సాధారణమైన విషయం కాదు. అయితే కన్నడ బ్యూటీ రష్మికా ఆ చరిత్రను తిరగరాసింది. అసలు రష్మికా మండన్న ఈ స్థాయికి ఎదుగుతుందని ఎవ్వరూ ముందుగా ఊహించలేదు. తోటి హీరోయిన్లు సైతం ఈమెని చూసి కుళ్లు కునేలా ఈమె వరుస విజయాలను సాధిస్తూ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అసలు రష్మికా నటిగా మారాలని అనుకోలేదట. ఈమె చదివిన చదువుకు, ఈమె ప్రస్తుతం చేస్తోన్న వృత్తికి అసలు సంబంధమే లేదని చెప్పాలి. తాజాగా ఈమె మాట్లాడుతూ, చదివింది జర్నలిజమే అయినా సినిమాలు, హీరోయిన్ కావాలనే కోరిక నాకు కలిగింది. సినీ రంగం నన్ను బాగా ఆకర్షించింది. నటనపై ఆసక్తితో సినిమా చాన్స్ లు రాక మోడలింగ్‌లోకి అడుగు పెట్టాను. మోడల్‌గా క్లిక్ అయిన తర్వాత నాకు నటిగా అవకాశాలు వచ్చాయి. నా ముఖాన్ని గుర్తు పెట్టుకుంటారో లేదో అని మొదట్లో చాలా భయపడ్డాను. తొలి చిత్రమే పెద్ద ఘనవిజయం సాధించింది. గీత గోవిందం చిత్రంతో నా కెరీర్ ఓ మలుపు తిరిగింది ఆ తరువాత వచ్చిన వరుస అవకాశాలతో వేగంగా ఎదిగాను. ఇకపై కూడా ఆ క్రేజ్ పోకూడదని, ఎంతో జాగ్రత్తగా సినిమాలను, నా పాత్రలను చూసి నచ్చితేనే ఓకే చెబుతున్నానని చెప్పుకొచ్చింది రష్మిక.













