ప్రియాంక ఆస్తుల విలువెంతో తెలుసా?
టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రస్తుతం తెగ వినిపిస్తున్న హీరోయిన్ పేరు ప్రియాంక అరుళ్ మోహన్. స్టార్ హీరోలతో పాటూ చిన్న, మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్రేజ్ ఉంది, ఆఫర్లొస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతీ అవకాశానికి ఓకే చెప్పడం లేదు ప్రియాంక.
మంచి స్టోరీ ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన ఓజీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా నానితో సరిపోదా శనివారం సినిమాలో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటించనుంది. కెరీర్ మొదలు పెట్టి తక్కువ సమయమే అయినా అమ్మడు రెమ్యూనరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రియాంక ఇప్పటికే దాదాపు రూ.25 కోట్ల వరకు సంపాందించినట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రియాంకకు భారీ ఆదాయం సమకూరుతుందని అందుకే ఈ రేంజ్ లో అమ్మడి సంపాదన ఉందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక రీసెంట్గా చెన్నైలో లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నట్లు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవడమంటే ఇదేనేమో అని ప్రియాంకను చూసి అందరూ అనుకుంటున్నారు.













