Payal Rajput: తండ్రి ఆరోగ్యంపై పాయల్ పోస్ట్ వైరల్
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న పాయల్ రాజ్పుత్(Payal Rajaput) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ వ్యక్తిగత విషయాను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా పాయల్ తన తండ్రి గురించి ఓ అప్డేట్ ఇస్తూ ఎమోషనల్ అయింది.
తన తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా అనే క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఇప్పుడే దానికి చికిత్స మొదలుపెట్టామని, మొదటి కీమోథెరపీ సెషన్ పూర్తైందని పాయల్ వెల్లడించింది. తన తండ్రి అనారోగ్య సమస్య గురించి తెలిసిన వెంటనే తాను చాలా భయపడ్డానని చెప్తున్న పాయల్ త్వరలోనే ఆయన కోలుకుంటారని, దానికి అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరింది.
తన తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ లో ఉన్నప్పటికీ తనను షూటింగ్స్ కు వెళ్లమనే చెప్తున్నారని, ఈ టైమ్ లో కూడా తన తండ్రి తనకు ధైర్యాన్నిస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. తను షూటింగ్స్ కు వెళ్లినా తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్న హాస్పిటల్ సిబ్బందితో పాటూ ఆయనకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లకు కూడా పాయల్ థ్యాంక్స్ చెప్తూ చేతికి సెలైన్ ఎక్కిస్తున్న ఫోటోను షేర్ చేసింది. పాయల్ పోస్టుకు పలువురు స్పందిస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు.













