మెగా డాటర్ నిహారికకు ఎంగేజ్మెంట్ జరిగిందా?
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా తన పెళ్లి గురించి పరోక్షంగా హింట్ ఇవ్వడంతో నిహారిక పెళ్లి విషయం మీడియాలో హల్చల్గా మారింది. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా చాలా జాగ్రత్తగా అడుగులెస్తున్నది. అయితే నిహారిక విషయంలో ఆసక్తికరమైన విషయాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
గత కొద్దినెలలుగా నిహారిక కొణిదెల పెళ్లి వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మనసు చిత్రంలో కలిసి నటించిన యువ హీరో నాగశౌర్యతో పెళ్లి అని, అలాగే ప్రభాస్‌తో వివాహం అనే వార్తలు విస్తృతంగా ప్రచారం జరిగాయి. అయితే తాజాగా వాటిలో నిజం లేదంటూ నిహారిక క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మిస్ నిహారిక అనే ట్యాగ్‌లో మిస్‌ను కొట్టేసి.. మిసెస్ నిహారిక అంటూ ఓ కాఫీ కప్పుపై ఉన్న ఫోటోను నిహారిక ట్వీట్ చేసి గురువారం ఉదయమే మీడియాకు చేతినిండా పనిపెట్టారు. దాంతో ఎంగేజ్మెంట్ జరిగిందా? అని ఆరా తీస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి.
మెగా డాటర్ నిహారిక పెళ్లికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు లాక్డౌన్ సమయంలో జరిగాయి. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చాలా నిరాడంబరంగా, కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య జరిగిందనే టాక్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సీక్రెట్‌గా నిర్వహించడంపైనే అంతా చర్చ జరుగుతున్నది. మీడియా రిపోర్టుల ప్రకారం.. నిహారికను వివాహం చేసుకొనే అబ్బాయి ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబంతో మెగా ఫ్యామిలీ వియ్యం అందుకోబోతున్నారు. ఇటీవల జరిగిన ఎంగేజ్మెంట్ కార్యక్రమం అత్యంత సీక్రెట్‌గా, ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించారు.
మీడియాకు ఫోటోలు కూడా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో నిహారిక తన కాబోయే భర్త ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కాబోయే భర్త ముఖాన్ని కనిపించకుండా గట్టిగా కౌగిలించుకొన్న ఫోటోను షేర్ చేసింది. దాంతో భర్త ఎవరనే విషయం మరింత సీక్రెట్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో మరింత ట్రెండ్ అవుతున్నది. అయితే నిహారిక పెట్టిన పోస్టుకు అనూహ్యంగా కామెంట్లు పడుతున్నాయి. థ్యాంక్స్, ఎప్పుడు? ఏమిటి? ఎవరు? అనే ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు. అయితే నిహారిక , మెగా ఫ్యామిలీ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరిగిందనే ఆసక్తి పెరుగుతున్నది. త్వరలోనే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.













