Neha Shetty: భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి
గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి నేహా శెట్టి
నాకు వడ్డాణం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ వడ్డాణం కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీనటి నేహా శెట్టి (డీజే టిల్లు ఫేం) అన్నారు. భీమవరం జెపి రోడ్డులో గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను శనివారం సినీనటి నేహా శెట్టి ప్రారంభించారు. గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ఇప్పటి వరకు 20వ షోరూంలున్నా 3వ స్టోర్ నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించి భీమవరంలో 20వ స్టోర్ గా ప్రారంభమైందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి నేహా శెట్టి అన్నారు.
నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్ అని, వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.






