ఫ్లోరిడా బీచ్‌లో చిరుత బ్యూటీ చక్కర్లు …
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలుకరించింది బీహార్ భామ నేహాశర్మ. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరి కుర్రాడు చిత్రం తర్వాత మరే తెలుగు చిత్రంలో కనిపించలేదు. ఈ భామ సోషల్ మీడియాలో హాట్ లుక్ వీడియోను పోస్ట్ చేసింది. ఫ్లోరిడాలోని ఓ బీచ్‌లో తన సోదరి ఐషాతో కలిసి సరదాగా చక్కర్లు కొడుతోంది నేహా శర్మ. బీచ్‌లోని తెల్ల ఇసుకను చూపిస్తూ అందాలు ఆరబోసిన నేహా శర్మ వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. బీచ్ వెకేషన్ లో ఉన్న ఐషా, నేహాశర్మ మరిన్ని అప్ డేట్స్ ఇస్తారేమోనంటూ ఆసక్తిగా చూస్తున్నారు పలువురు నెటిజన్లు. తమిళ్, మలయాళం, హిందీలో పలు చిత్రాల్లో నటించిన నేహాశర్మ ప్రస్తుతం ఓ పంజాబీ సినిమా చేస్తోంది.













