నయన్ ఆస్తుల విలువెంతంటే?
నయనతార. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆమెను గౌరవంగా తలైవి అని, లేడీ సూపర్‌స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. సౌత్‌లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయన్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలవుతుంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసి తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోయింది.
రీసెంట్గా జవాన్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్ హీరోయిన్ గా మారిన నయనతార ఒక్కో సినిమాకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటూ చాలానే ఆస్తులను సంపాదించింది. అసలు నయన్ ఆస్తుల విలువెంత అంటే సుమారు రూ.200 కోట్లు ఉంటుందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇందులో పలు చోట్ల అపార్ట్మెంట్స్, విల్లాలు, ప్లేస్‌లు, కార్లు, క్యాష్, ప్రైవేట్ జెట్ అన్నీ ఉన్నాయి.
ఒక్కో సినిమాకు దాదాపు రూ.8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార సంవత్సరానికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తుంది. దానికి తోడు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఎలాగూ ఉంటాయి. అంతేకాదు నయనతారకు వీటితో పాటూ మరికొన్ని విలువైన ఫిక్డ్స్ అస్సెట్స్ కూడా ఉన్నాయట. వీటితో పాటూ కొన్ని లగ్జరీ కార్లు కూడా ఆమె దగ్గర గ్యారేజ్‌లో ఉన్నాయట.













