సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ మనసుల్ని “లయ” తప్పిస్తున్న హీరోయిన్…!
సౌందర్య తర్వాత తెలుగు కుటుంబ చిత్రాలలో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన హీరోయిన్ లయ. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు తో పాటు కొన్ని మలయాళం చిత్రాలలో తళుక్కుమంది ఈ హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది లయ. వివాహం అనంతరం పూర్తిగా గృహిణిగా మారిపోయి ఫ్యామిలీ టైం ని ఎంజాయ్ చేస్తుంది.
హీరోయిన్ లయ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవ్వకముందే చదరంగం క్రీడాకారిణిగా రాణించారు. అనుకోకుండా సినిమాల్లో అవకాశం రావడంతో తన కెరీర్ ని సినిమా దిశగా పయనింపచేసారు. ఇక ఈ హీరోయిన్ ఫ్యామిలీ విషయాలకి వస్తే, వృత్తి రీత్యా డాక్టర్ అయిన గణేష్ గొర్తి ని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేసిక్ గా కూచిపూడి డాన్సర్ అయిన లయ పెర్ఫార్మన్స్ చూసి సినిమాల్లో అవకాశం వచ్చింది. ఈ అమ్మడి మొదటి సినిమా స్వయంవరం. హీరో వేణు కి జోడిగా నటించి పెంకి పిల్లగా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. వివాహం తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమకి దూరమైన ఈ హీరోయిన్, సోషల్ మీడియా వేదికగా తన అభిమానులని పలకరిస్తుంది. అప్పటి మీద కాస్త సన్నబడి ప్రేక్షకుల దృష్టిని మరోసారి ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీల్స్ చేస్తూ కనువిందు చేస్తుంది. అభిమానులకి, ప్రేక్షకులకి దగ్గరవడానికి సోషల్ మీడియా తనకెంతో ఉపయోగపడిందని చెప్పకనే చెప్పింది ఈ అమ్మడు. తన హోంలీ లుక్స్ తో ఈ తరం ప్రేక్షకుల మనసుల్ని కూడా లయ తెప్పిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.













