3 ఫ్లాపులకే రియలైజ్ అయిన హీరోయిన్..
ఉప్పెన మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృతి శెట్టి.. ఎంట్రీతోనే అందరి హృదయాల్ని కొల్లగొట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కృతి కూడా ఒక రీజన్. మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కృతి, తన తర్వాతి సినిమాలను నాని, నాగ చైతన్యలతో చేసింది. మొదటి మూడు సినిమాలు హిట్ అయ్యేసరికి కృతి రేంజ్, క్రేజ్ బాగా పెరిగాయి.
వచ్చిన ఆఫర్లన్నింటికీ ఓకే చెప్తూ టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారింది. అక్కడే బొమ్మ తేడా కొట్టింది. రామ్ తో చేసిన ది వారియర్, నితిన్‌తో చేసిన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూడు సినిమాలూ వరుసగా డిజాస్టర్లయ్యాయి.
దీంతో ఇక మీదట వచ్చిన ప్రతి సినిమా చేయకుండా, బాగా ఆలోచించాక డెసిషన్ తీసుకోవాలని నిర్ణయించుకుందట కృతి. ప్రస్తుతం మళయాళ పీరియాడికల్ ఫిల్మ్‌తో కృతి శెట్టి మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అక్కడ తన లక్‌ను టెస్ట్ చేసుకోబోతుంది.
కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కులేమనుకుందో ఏమో కానీ, రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానన్నా సరే స్టోరీలో మేటర్ ఉంటే తప్ప సినిమా చేయను అంటోందట కృతి. మొత్తానికి 3 ఫ్లాపులకే కృతికి సీన్ అర్థమైపోయిందటే ఆమె చాలా త్వరగా రియలైజ్ అయినట్లే లెక్క. హీరోయిన్గా లాంగ్ రన్ ఉండాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే కెరీర్‌కు చాలా త్వరగా ఎండ్ కార్డ్ పడుతుంది. వరుసగా 3 ఫ్లాపులు వచ్చేసరికి అమ్మడికి ఆఫర్లు కూడా రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం కృతి, నాగచైతన్యతో కస్టడీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో అయినా మరి ఈ బ్యూటీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.













