కృతి ఆశలన్నీ 2024పైనే…!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి ఆ సినిమా సక్సెస్ అవడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్నప్పటికీ అమ్మడు కొన్నేళ్ల పాటూ ఇక్కడ కెరీర్ ను బాగానే రన్ చేయగలదని మొదటి సినిమాతోనే నిరూపించుకుంది. అయితే ఉప్పెన తర్వాత కథల విషయంలో పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఆ క్రేజ్ వెంటనే తగ్గిపోయింది.
ఫలితంగా కృతికి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆమె లాస్ట్ ఇయర్ చేసిన సినిమాల్లో బంగార్రాజు మినహా అన్నీ ఫ్లాపులే. దీంతో అమ్మడికి తెలుగులో ఆఫర్లు తగ్గాయ. ప్రస్తుతం మలయాళంలో టోవినో థామస్ తో ఓ సినిమా, తమిళంలో జయం రవితో ఓ సినిమాలో నటిస్తున్న కృతి, తెలుగులో శర్వానంద్ సరసన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తుంది.
ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే వచ్చే ఏడాది కృతి మళ్లీ ఫామ్ లోకి వచ్చే ఛాన్సుందని చెప్పొచ్చు. దీంతో తన ఆశలన్నీ 2024పైనే పెట్టుకుంది కృతి. మొదట్లో పెద్దగా ఫోటోషూట్లకు ఆసక్తి చూపించని కృతి ఇప్పుడు తెగ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్లో ఉంటుంది.













