మారిపోయిన కమిలిని ముఖర్జీ…!
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా “ఆనంద్” . మంచి కాఫీ లాంటి సినిమా అంటూ అప్పట్లో చాలా క్రేజ్ ని సాధించింది ఈ సినిమా. శేఖర్ కమ్ముల కెరీర్ లోనే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. ఆనంద్ సినిమా ద్వారా బెంగాలీ ముద్దుగుమ్మ కమిలిని ముఖర్జీ తెలుగు తెరకి పరిచయం అయిందన్న విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ బెంగాలీ అమ్మడి తర్వాత సినిమా “గోదావరి”. హీరో సుమంత్ తో జతకట్టిన ఈ సినిమా కూడా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం విశేషం. “హ్యాపీడేస్, గమ్యం, జల్సా” వంటి సినిమాల్లోనూ నటించి అందరి ప్రశంసలు అందుకుంది కమలినీ ముఖర్జీ. తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో నటించింది. ఈ హీరోయిన్ నటించింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
గత కొంత కాలంగా అమెరికాలో సెటిలైన కమలినీ ముఖర్జీ అక్కడ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసిందట. అక్కడే పెర్మనెంట్ గా సెటిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు అందరు ఆమె గురించి మర్చిపోయిన తరుణంలో, రీసెంట్ గా ఆమె ఫొటోలు వీడియోలు బయటికి రావడంతో కమిలిని ఫాన్స్, ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారని చెప్పాలి. మునుపటి ఫిజిక్ కు భిన్నంగా కాస్త బొద్దుగా తను కనిపిస్తుండటంతో, అంతా శేఖర్ కమ్ముల హీరోయిన్ ఏంటీ ఇలా అయింది? అని ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వీడియోలు, ఫోటోల విషయానికి వస్తే తాజాగా డల్లాస్ లో ఓ ప్రైవేట్ పార్టీ జరిగింది. ఆ ఈవెంట్ లో కమలినీ ముఖర్జీ పాల్గొని సందడి చేసింది. సినిమాల్లో వుండగా స్లిమ్ గా నాజూకు సుందరిగా కనిపించి, తన అందాలతో కుర్రకారుని ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీ హఠాత్తుగా డల్లాస్ పార్టీలో బొద్దుగా కనిపించింది. ప్రస్తుతం ఈ బెంగాలీ ముద్దుగుమ్మ ఏంటీ ఇలా అయిపోయిందని నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు.













