సింగిల్ పీస్ లో జ్యోతి రాయ్
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జ్యోతి రాయ్.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతోంది. సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తాజాగా సింగిల్ పీస్ వైట్ కలర్ డ్రెస్ వేసిన ఈ అమ్మడు.. సోఫాలో కూర్చుని చేతిలో వైన్ గ్లాస్ తో కొంటె చూపులతో సోషల్ మీడియాను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.













