మూడో పెళ్లిపై స్పందించిన సహజ నటి …!
టాలీవుడ్ లో సహజనటిగా జయసుధకు ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జయసుధ జీవించేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. చాలా చిన్న వయసులోనే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. యాభై ఏళ్ల ఆమె సినీ కెరీర్ లో జయసుధ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రస్తుతం జయసుధ మూడో పెళ్లికి రెడీ అవుతున్నారట. రీసెంట్ గా ఆమె వెంట ఒక విదేశీయుడు తరచూ కనిపించటమే దీనికి కారణమని తెలుస్తుంది. వీరిద్దరిని ఇలా చూసినప్పటినుండి చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆమెని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ మీడియా ఛానెల్ డైరెక్ట్ గా జయసుధని మూడో పెళ్లి చేసుకోనున్నారట కదా? అని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆమె మూడో పెళ్లేంటని ప్రశ్నించారు.
తన వెంట సన్నిహితంగా ఉండే అతను తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చిన వ్యక్తిగా జయసుధ క్లారిటీ ఇచ్చారు. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తన ప్రాధాన్యత, తనకు ఇచ్చే గౌరవాన్ని స్వయంగా చూడటం ద్వారా మరింత బెటర్ గా ఉండేలా సినిమాను తీసేందుకు తన ప్రతి ఈవెంట్ కు ఆ విదేశీయుడు హాజరవుతున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు తానుకలిసినట్లుగా చెప్పారు. తాను తాజాగా తీస్తున్న బయోపిక్ కూడా అధ్యాత్మిక కోణంలో ఉంటుందని చెబుతున్నారు.













