నటి హేమ సంచలన ప్రకటన
టాలీవుడ్ సినీ నటి హేమ సంచలన ప్రకటన చేశారు. త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హేమ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమై మళ్లీ సినిమాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ పూర్తిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని హేమ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను రాజమండ్రిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నానని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.













