మా ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన నటి హేమ
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ నటి హేమ గెలుపొందారు. మా అధ్యక్ష పదవికి సీనియర్ నటులు నరేశ్, శివాజీరాజా పోటీపడగా.. 268 ఓట్లతో నరేశ్ గెలుపొందారు. ముందునుంచే మహిళలంతా తనకే సపోర్ట్ చేస్తారని కచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా గెలుస్తానని ధీమాగా చెప్పిన హేమ గెలుపొందారు. గత కార్యవర్గంలో జాయింట్ సెక్రటరిగా హేమ సేవలు అందించారు. గతంలో పలుసార్లు ఇ.సి మెంబర్గా నటి హేమ ఉన్నా, శివాజీరాజా ప్యానెల్లో తగిన ప్రాతినిధ్యం లభించకే స్వత్రంతంగా పోటీ చేస్తున్నానని హేమ ఆరోపించారు. అందరం మా సభ్యుల సంక్షేమం కోసమే కృషి చేస్తామని హేమా సృష్టం చేశారు.













