Divi: సింగర్ మంగ్లీ బర్తడే పార్టీపై నటి దివి వివరణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. మంగ్లీ (Mangli) పుట్టిన రోజు వేడుకలు సంచలనంగా మారాయి. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు.
అయితే ఈ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకుంటున్నట్టు సమాచారం రావడంతో చేవెళ్ల పోలీసులు త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, పార్టీలో ఉన్న 48 మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా, అందులో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

మంగ్లీ బర్త్ డే పార్టీలో తెలుగు నటి దివి వద్త్య కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు , వీడియోలు సైతం బయటకు వచ్చాయి. దీంతో ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై దివి క్లారిటీ ఇచ్చారు. మంగ్లీ తన స్నేహితురాలు అని అమె మంచిదని , అందుకే ఆమె బర్త్ డే వేడుకలకు వెళ్లానని దివి తెలిపింది. మంగ్లీ నా స్నేహితురాలని, అందుకే ఆమె బర్త్ డే వేడుకలకు వెళ్లానని దివి చెప్పుకొచ్చింది. కేవలం వ్యక్తిగత సంబంధం ఆధారంగానే తాను ఆ వేడుకకు వెళ్లానని, దానిపై అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆమె పరోక్షంగా సూచించారు.