డిఫరెంట్ అఫుట్ఫిట్లో మెరిసిన అనన్య
లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కు పరిచయమైన అనన్య పాండే తెలుగులో నటించిన మొదటి సినిమానే కమర్షియల్ ఫ్లాప్ అవడంతో తర్వాత మళ్లీ తెలుగులో ఆఫర్లు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అమ్మడి హవా బాగానే కొనసాగుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందాలను షేర్ చేస్తూ ఉంటుంది అనన్య. తాజాగా అనన్య ఓ అవార్డ్ ఫంక్షన్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ లో కనిపించి మెప్పించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













