గుణ 369లో మరో మలబారు బ్యూటీ
మలయాళ ముద్దుగుమ్మలకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసిన్, నయనతార, ప్రియమణి, నిత్యామీనన్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, ప్రియా వారియర్…ఓపిగ్గా తెలసుకోవాలేగానీ, ఈ లిస్టు పెరుగుతూనే ఉంటుంది. ఈ లిస్ట్‌లో జత కలుస్తున్నారు. మరో మలబారు బ్యూటీ. ఆమె పేరు అనుఘ. ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ సరసన గుణ 369లో అనుఘ జోడీ కడుతున్నారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న గుణ 369తో కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతుండడం తెలిసిందే.













