బోల్డ్ కంటెంట్‌తో రూపొందనున్న వెబ్‌సిరీస్‌లో అమలా పాల్!
ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే ఏయే కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమా ఎలా ఉంది, ఏ సినిమా చూడాలి.. ఇలాంటి డిస్కషన్స్ నడిచేవి. కానీ, ఇప్పుడలా కాదు, థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పట్లో ప్రేక్షకులకు థియేటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో అందరూ డిజిటల్ రంగంపైనే దృష్టి పెడుతున్నారు. ఓటీటీలో సినిమాలు చూసేందుకు అలవాటు పడుతున్నారు. థియేటర్లో సినిమా చూడాలన్నా, ఓటీటీలో సినిమా చూడాలన్నా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు కనిపిస్తోంది. కటౌట్ కంటే కంటెంట్ ముఖ్యం అన్న ధోరణి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు్. నాన్చుడు వ్యవహారం ఇక్కడ పనికిరాదు. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ స్టేజ్‌లో ఉన్నారు. కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాలైతే తప్ప ప్రేక్షకులకు రుచించడం లేదు. అందుకని కొంతమంది వెబ్ సిరీస్‌లవైపు దృష్టి సారిస్తున్నారు. ఓటీటీకి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది దర్శక నిర్మాతలు డిజిటల్లో సెన్సార్ ఇబ్బందులు లేవు కాబట్టి బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. అలాంటి సినిమాలైతే యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చెయ్యొచ్చు. ఇదే ఆలోచన కొత్తగా వెబ్ సిరీస్ చేసేవారిలో కనిపిస్తోంది.
కొంతమంది దర్శక నిర్మాతలు డిజిటల్లో సెన్సార్ ఇబ్బందులు లేవు కాబట్టి బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. అలాంటి సినిమాలైతే యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చెయ్యొచ్చు. ఇదే ఆలోచన కొత్తగా వెబ్ సిరీస్ చేసేవారిలో కనిపిస్తోంది. గత సంవత్సరం వచ్చిన `ఆమె` చిత్రంలో న్యూడ్‌గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన అమలాపాల్ ఇప్పుడు ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ రూపొందించే ఈ వెబ్ సిరీస్‌లో తాహిర్ రాజ్ బసిన్, అమృత పూరి కీలక పాత్రలు పోషిస్తారు. ఈ సిరీస్‌లో అమలాపాల్ కొన్ని హాట్ సీన్స్‌లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది అమల. ఈ వెబ్ సిరీస్‌ను జియో ఎంటర్టైన్మెంట్తో కలిసి మహేష్ భట్ నిర్మించనున్నాడు.













