Abhinaya: నిశ్చితార్థం చేసుకున్న అభినయ
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన అభినయ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vaakitlo Sirimalle Chettu) సినిమాలో వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu)కి చెల్లిగా నటించిన అభినయ ఆ సినిమాతో అందరికీ బాగా గుర్తుండిపోయింది. తాజాగా అమ్మడు తన ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.
తన కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను షేర్ చేసి తమ ప్రయాణం మొదలైందని చేతికి రింగులున్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఎంగేజ్మెంట్ అయిందనే విషయాన్ని అనౌన్స్ చేసింది. నెల రోజుల ముందు ఓ తమిళ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అభినయ 15 ఏళ్లుగా తన చిన్ననాటి ఫ్రెండ్‌తో రిలేషన్షిప్ లో ఉన్న విషయాన్ని వెల్లడించింది.
కానీ అతనెవరనేది మాత్రం అభినయ చెప్పలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా తన కాబోయే భర్తను అభినయ(Abinaya) రివీల్ చేయలేదు. అభినయ పోస్టుకు అందరూ శుభాకాంక్షలు చెప్తూ ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అభినయ, విశాల్(Vishal) ను పెళ్లి చేసుకోనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని తన దగ్గర ప్రస్తావిస్తే అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది. అయితే నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినయకు చెవుడు, మూగ. అయినప్పటికీ తన నటనతో అందరినీ ఇంప్రెస్ చేయడమంటే చాలా పెద్ద విషయమే. తెలుగులో అభినయ శంభో శివ శంభో(Shambho Siva Shambo), కింగ్(King), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vaakitlo Sirimalle Chettu), దమ్ము(dhammu), ఢమరుకం(Damarukham), ధృవ(Dhruva), గామి(Gaami) సినిమాల్లో నటించి మెప్పించింది.













