ఘనంగా హీరో విశాల్ నిశ్చితార్థం
తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అల్ల అనీశా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఓ హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్కు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. సెప్టెంబరులో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో అనీశా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సందర్భంగా తీసిన పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు విశాల్, అనీశాకు శుభాకాంక్షలు చెప్పారు.













