వైజాగ్ ప్రసాద్ ఇకలేరు
నటుడు వైజాగ్ ప్రసాద్ (75) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. రంగస్థల, వెండి తెర, బుల్లి తెర నటుడిగా ఆయన సుపరిచితులు. ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. 1963లో నాటక రంగంలో ప్రవేశించి దాదాపు 700 నాటకాల్లో నటించారు. 1983లో బాబాయ్ అబ్బాయ్ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగలు చేస్తున్నారు. వారు వచ్చేవరకు ప్రసాద్ మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు బంధువు సత్యనారాయణ తెలిపారు.













